ఖైదీ నంబర్ 150.. 100 కోట్లు కలెక్ట్ చేయలేదా?
మెగాస్టార్ చిరంజీవి కమ్‌బ్యాక్ సినిమా ఖైదీ నంబర్ 150.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. దాదాపు నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ చిరంజీవి మూవీ తుడిచిపెట్టేసింది. అంతేకాదు.. సినిమా 100 కోట్ల కలెక్షన్లను సాధించిందంటూ అల్లు అరవింద్ కూడా స్వయంగా ప్రకటించాడు. అయితే.. చిత్ర నిర్మాత రామ్‌చరణ్ మాత్రం అన్ని కలెక్షన్లేమీ రాలేదంటున్నాడట. ఖైదీ నంబర్ 150 సినిమా ఫుల్ రన్‌లో కేవలం రూ.75 కోట్ల కలెక్షన్లను సాధించినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందించిన రిటర్న్స్‌లో చెర్రీ పేర్కొన్నాడట. చిరంజీవి పారితోషికం రూ.20 కోట్లు, డైరెక్టర్ వినాయక్ పారితోషికం రూ.10 కోట్లు సహా.. సినిమాకు రూ.60 కోట్లు ఖర్చు పెట్టామని, రూ.15 కోట్లను లాభాలుగా ఆర్జించామని ఐటీ అధికారులకు చెర్రీ వెల్లడించాడని టాక్. వాస్తవానికి సినిమా రిలీజైన వారం రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు అల్లు అరవింద్, వీవీ వినాయక్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఫుల్ రన్‌లో రూ.105 కోట్లను సాధించినట్లు వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారమైతే చిరు పారితోషికాన్ని మినహాయిస్తే సినిమా ఖర్చులు రూ.40 కోట్లు పోను రూ.60 కోట్లు చెర్రీ పాకెట్లోకి చేరినట్టేనని, చిరు పారితోషికాన్ని కూడా ఖర్చుల్లో లెక్కేసినా ఎటుబడి రూ.35 కోట్లు లాభం చేకూరినట్టేనని ఫిల్మ్‌నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి వాస్తవాలేంటో చెర్రీకే తెలియాలి.
Comments
Post a Comment