‘ఇస్రో’ విజయంపై చైనా ఏమని వ్యాఖ్యానించిందంటే..?
బీజింగ్: ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ "ఇస్రో' చరిత్ర సృష్టించడంపై చైనా అధికారిక మీడియా స్పందించింది. ‘ఇస్రో’ తన ప్రయోగంతో భారతీయులు గర్వపడేలా చేసిందని పేర్కొంది. తక్కువ బడ్జెట్‌లో గొప్ప ఫలితాలు రాబడుతున్న ఇస్రో.. తన ప్రయోగాలతో ఇతర దేశాల ‘మెదడుకు మేత’ పెట్టిందని వ్యాఖ్యనించింది. స్పేస్ టెక్నాలజీలో భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇదని వ్యాఖ్యానించిన ‘గ్లోబల్ టైమ్స్’, భారతీయులు గర్వపడడానికి ఇంతకుమించిన కారణం ఏముంటుందని తన సంపాదకీయంలో పేర్కొంది.
కాగా ఇదే డైలీ 2013లో ‘మంగళయాన్’ ప్రయోగంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. అరుణగ్రహంపై మంగళయాన్ ఉపగ్రహాన్ని పంపించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కోట్లాదిమంది పేదలు, నిరక్షరాస్యతతో బాధపడుతున్న భారత్‌కు ‘మంగళయాన్’ అవసరమా? అంటూ విమర్శించింది. ఇప్పుడు అదే మీడియా పీఎస్ఎల్ఎల్వీ సీ-37 ప్రయోగాన్ని కొనియాడడం గమనార్హం.
Comments
Post a Comment