రోజు ఇలా 5 నిముషాలు చేస్తే నెల రోజులలో పొట్టని పూర్తిగా తగ్గించుకోవచ్చు
ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తున్న సమస్యఅధిక బరువు, అధిక బరువు ఉన్నవారికి కలిగే అసౌకర్యాల్లో ముందుకు తన్నుకొచ్చిన పొట్ట కూడా ఒకటి. భారీగా పెరిగిన పొట్టని తగ్గించుకోవడం కోసం అనేక మంది తమకు తెలిసిన పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు, కొంత మంది పొట్టని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరిగి కొత్త రోగాలని కూడా తెచ్చుకుంటున్నారు, అధిక బరువు వల్ల చాలామంది మానసికంగా కూడా బాధపడిపోతున్నారు, సాధారణంగా మన శరీరంలో కొవ్వు అధికంగా పెరిగిపోవడం వల్ల మనకి పొట్ట పెరిగిపోతుంది, అదే క్రమంలో మన శరీరంలో కొవ్వు పెరిగిపోతుంటే మనకి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ఆవకాశం ఉంది, శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించుకోవడానికి రకరకాల ఎక్సర్‌సైజ్ లని ప్రయత్నిస్తుంటారు, వాటితో పాటు ఒక సింపుల్ ఎక్సర్‌సైజ్ ని రోజుకి 5 నిమిషాల పాటు చేస్తే మన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వుని 30 రోజులలో తగ్గించుకోవచ్చు.
పైన ఫొటోలో చూపించిన విధంగా నేలపై పడుకొని మోచేతులని, కాలి వేళ్లను ఆధారంగా చేసుకుని శరీరం మొత్తాన్ని పైకి లేపాలి, అలానే కొద్దిసేపు ఉండాలి, ఇలా చేయడం వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది, ఈ ఎక్సర్‌సైజ్ వల్ల కొవ్వు కరగటంతో పాటు కండరాలు కూడా పటిష్టంగా అవుతాయి, ఈ ఎక్సర్‌సైజ్ ని ప్లాంక్ ఎక్సర్‌సైజ్ అని అంటారు, ఇలా నెల రోజులు చేస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని పూర్తిగా తగ్గించుకోవచ్చు, ఈ ఎక్సర్‌సైజ్ వల్ల బాడీ కూడా ఫిట్ గా ఉంటుంది, ప్లాంక్ ఎక్సర్‌సైజ్ ని ఎలా చేయాలో కింద వీడియోలో చూడవచ్చు.
Comments
Post a Comment