SALUTE TO AP DGP SIR.
రోడ్డు ప్రమాదంలో చావుబతుకుల మధ్య ఉంటే మీరేం చేస్తారు? మహా అయితే 108కి ఫోన్ చేసి వెళ్లిపోతారు. కానీ, ఒక డీజీపీ స్థాయి అధికారి అలా చేయలేదు. రోడ్డు మీద గాయాలతో పడి ఉన్న యువకుడ్ని భుజానెత్తుకున్నాడు. తన కారులో కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తక్షణం చికిత్స చేయించాడు. ఇదేదో…సినిమా స్టోరీలా ఉందా..? కానేకాదు..నిన్న రాత్రి జరిగిన వాస్తవం. మానవత్వంతో స్పందించిన ఐపీఎస్ ఎవరో కాదు ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు. పుష్కరాల సందర్భంగా సోమవారం రాత్రి శాంతిభద్రతలను పర్యవేక్షించి విజయవాడ బందర్ రోడ్డు మీదుగా వెళుతున్నారు. అదే రోడ్డులో యువకుడ్ని ఒక కారు ఢీ కొట్టి వెళ్లిపోయింది. గాయాలతో యువకుడి రోడ్డు మీద పడి కొట్టుమిట్టాడుతున్నాడు. అటుగా వెళుతోన్న సాంబశివరావు గాయపడిన యువకుడ్ని చూశాడు. వెంటనే కాన్వాయ్ ను ఆపించాడు. యువకుడ్ని తన కారులో కూర్చొబెట్టుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడంతో యువకుడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు
Comments
Post a Comment