చంద్రబాబు కష్టపడుతున్నారు: పవన్
తిరుపతి: సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని పవన్‌కల్యాణ్ కితాబిచ్చారు. తాను కొన్ని సూచనలు చేస్తాను..సహృదయంతో తీసుకోండని చంద్రబాబును పవన్ కోరారు. హోదా అంశాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారని, కేంద్రంతో ఘర్షణపడితే నిధులు రావని సీఎం అంటున్నారన్నారు. యాచకుల్లా ఎంత కాలం సార్..సార్ అని కేంద్రాన్ని బతిమాలాలని పవన్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్య మాటలు వింటుంటే విసుగు, అసహనం కలుగుతోందన్నారు. అప్పుడు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగారు.. ఇప్పుడు హోదాతో ఒరిగేదేమీలేదనడం అన్యాయమని పవన్‌కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Post a Comment