ఆమె కడుపులో పెరుగుతోంది అదే..
ఫ్లోరిడా: ప్రపంచంలో వింతలకు ఏమాత్రం కొదవలేదు. ప్రతి రోజూ ఏదోమూల అటువంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది వింటే మాత్రం షాక్‌కు గురికాక తప్పరు. ఫ్లోరిడాకు చెందిన మహిళ(33) ఏడువారాల క్రితం గర్భం దాల్చింది. గతంలో రెండుసార్లు ఆమెకు గర్భస్రావం కావడంతో ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటోందామె. వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల ఆస్పత్రికి వెళ్లింది. ఆమె గర్భాన్ని స్కాన్ చేసిన వైద్యులు నివ్వెరపోయారు. ఎందుకంటే స్కానింగ్‌లో పిండం స్థానంలో వారికి కనిపించింది కుందేలు పిల్ల ఆకారం. స్కానింగ్ చూసిన గర్భిణి సైతం నిశ్చేష్టురాలైంది. అయితే దానిని చూశాక నవ్వుకూడా వచ్చిందని ఆమె పేర్కొంది. ఆ స్కానింగ్‌ను సోషల్ మీడియాలో పెడుతూ ‘‘ఈరోజు ఆస్పత్రిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నా. నా కడుపులో ఓ కుందేలు పుడుతోంది’’ అని రాసింది. ఈ ఫొటో సామాజిక మాధ్యమంలో సంచలనమైంది.
Comments
Post a Comment