రిలయన్స్ జియో దెబ్బకు 10 లక్షల ఉద్యోగాలు గల్లంతు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో పోటీతో టెలికాం కంపెనీలు కుదేలవుతున్నాయి. జియో దెబ్బకు మార్చితో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశీయ టెలికాం కంపెనీల రాబడి రూ.4,900 కోట్లు పడిపోయింది. 2015-16లో రూ.1.93 లక్షల కోట్లున్న ఈ కంపెనీల ఆదాయం 2016-17లో రూ.1.88 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో ఇది మరింత తగ్గి రూ.1.84 లక్షల కోట్లకు దిగొస్తుందని బ్రోకరేజ్ సంస్థ సిఎల్‌ఎ్‌సఎ ఒక నివేదికలో పేర్కొంది. రాబడులతో పాటు రిలయన్స్ జియో ప్రవేశంతో దేశీయ టెలికాం రంగలో 10 లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం కూడా ఉందని అంచనా.
ఆదాయాలు గణనీయంగా తగ్గడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు గత ఆరు నెలల్లో దాదాపు 3,400 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. అత్యంత తక్కువ ధరలో డేటా, ఉచితంగా వాయిస్ కాల్స్ అనే జియో ఆఫర్లతో, మిగతా టెలికాం కంపెనీలు.. తమ టారి్‌ఫలు తగ్గించక తప్పలేదు. ఆ ప్రభావం కంపెనీల రాబడులు, లాభాలపైనా కనిపిస్తోంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి కంపెనీలో ఏదోలా నెట్టుకొస్తున్నా చిన్నాచితక కంపెనీలైతే జెండా ఎత్తివేసే స్థితికి చేరినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పరిశ్రమలో కన్సాలిడేషన్ కూడా ఊపందుకుంటోంది. ఈ పరిణామాలతో మున్ముందు దేశీయ టెలికాం రంగంలో మూడు నాలుగు కంపెనీలకు మించి నిలబడలేక పోవచ్చని భావిస్తున్నారు.
Comments
Post a Comment