ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన పుణె!



పుణె: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఓ రికార్డు నమోదయింది. పుణె వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డు నమోదయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. సంజూ శాంసన్ సూపర్ సెంచరీ సహా బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన పుణె 16.1 ఓవర్లలోనే 108 పరుగులకు ఆలైట్ అయింది. పుణె జట్టులోని బ్యాట్స్‌మెన్లందరూ క్యాచ్ అవుట్‌గా వెనుదిరగడమే ఇక్కడ రికార్డు. ఐపీఎల్ ప్రారంభమయ్యాక ఒక జట్టు క్యాచ్‌ల ద్వారానే ఆలౌట్ అవడం ఇదే తొలిసారి.

Comments

Popular posts from this blog

Samsung Galaxy Note 8 256GB

Why is ‘Bigg Boss’ so popular?