సినిమా ప్రమోషన్ల కోసం బాలీవుడ్ హీరోలు ఎంతలా దిగజారుతున్నారో తెలిపే సంఘటన ఇది. హీరో డైరెక్టర్‌కు లిప్‌లాక్ ఇచ్చేశాడు. అలా చేసింది ఓ స్టార్ హీరో. జగ్గాజాసూస్ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా రణ్‌బీర్ కపూర్.. డైరెక్టర్ అనురాగ్ బసును ముద్దాడాడు. ప్రమోషన్లలో భాగంగా ‘గల్తీ సే మిస్టేక్’ పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ నిర్వహించింది. అయితే.. ఒక్కసారిగా అనురాగ్ బసును రణ్‌బీర్ కపూర్.. అందరూ చూస్తుండగానే మీడియాలైవ్‌లోనే ముద్దు పెట్టేశాడు. దీంతో అక్కడున్నవారంతా కంగుతిన్నారు. ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఇలా చేయడం రణ్‌బీర్‌కు తొలిసారేం కాదు. ఐదేళ్ల క్రితం కూడా ఇలాగే చేశాడు రణ్‌బీర్. బర్ఫీ చిత్ర ప్రమోషన్లో ఇదేవిధంగా అదే డైరెక్టర్ అనురాగ్ బసును ముద్దాడాడు రణ్‌బీర్ కపూర్. అయితే.. ఇదంతా ఓ పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. ఏదోలా వార్తల్లో నిలిచి సినిమాను ప్రమోట్ చేసుకోవాలనే తపనతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ సినిమా జూలై 14న విడుదల కాబోతోంది.

Comments

Popular posts from this blog

Samsung Galaxy Note 8 256GB