జీఎస్టీ ఎఫెక్ట్.. కార్లు, మొబైల్స్‌పై భారీ ఆఫర్లు

జీఎస్టీ ఎఫెక్ట్.. కార్లు, మొబైల్స్‌పై భారీ ఆఫర్లు





ఏలూరు: దేశవ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచే జీఎస్టీ అమలులోకి రాబోతుంది. విలాస వస్తువులపై సరాసరిన 28 శాతం పన్ను విధించారు. ఇక పక్కాగా లెక్కలు చెప్పాల్సిందేనని ఆంక్షలు విధిం చారు. ఏ వస్తువుకు ఎంత మొత్తంలో పన్ను వేయబోతున్నారో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. అప్పటి నుంచి డీలర్ల గుండెల్లో జీఎస్టీ బాంబు పేలింది. తక్కువ ధర, తక్కువ పన్ను ఉన్న సమయంలో నిల్వ చేసినవస్తువులను ఎలా వదిలించుకోవాలనే దానిపై ఇప్పుడు దృష్టి పెట్టారు. ఎంత వీలైతే అంత.. ఎడా పెడా అమ్మకాలకుగాను బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఉన్న పాత స్టాక్‌ తరిగితే అంతో ఇంతో బయట పడినట్టు భావిస్తున్నారు. దీనికి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. కస్టమర్లకు పెరగబోతున్న వస్తువుల ధరలను చేరవేసే ప్రయత్నంలో ఉన్నారు. వీలైనంత మేర ఈ నెలాఖరులోపే వస్తువును కొనుగోలు చేస్తే ఎంత మొత్తం కలిసి వస్తుందో చెబుతూనే ఆఫర్లను పాఠాలు మాదిరిగా చెబుతున్నారు.
 
కార్లపై భారీ ఆఫర్లు
మూడేళ్ళుగా జిల్లాలో కార్ల విక్రయం భారీగా పెరిగింది. వివిధ రకాల మోడళ్ళు మార్కెట్‌లోకి వచ్చాయి. పోటీతత్వం పెరిగింది. కారు కొనాలనే కాంక్ష మధ్య తరగతిలోనూ పెనవేసుకుంది. కాని కారు ధరను బట్టి, ఇచ్చే ఆఫర్‌ను బట్టి కొనుగోలుకే ఇలాంటి తరగతులు ముందుకు వస్తున్నాయి. సరిగ్గా ఇప్పుడు కార్ల అమ్మకాలపై 28 శాతం పన్ను విధించబోతున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను కొంతలో కొంత తగ్గించుకోవాలని, ఆ మేరకు అదనంగా ఆఫర్లను కస్టమర్ల చెవిన వేస్తున్నారు. కార్ల కంపెనీల్లో ఒక మాదిరి మోడల్‌కు ఇప్పటి వరకు రూ.15 వేలు వరకు ఆఫర్‌ ఇచ్చేవారు. జీఎస్టీ అమలులోకి రాబోతున్న తరుణంలో ఇప్పుడు మరో అడుగు ముందుకువేశారు. ఒక్కో రకం మోడల్‌కు ఇంతకుముందు రూ.40 వేల వరకు ఆఫర్‌ ఉంటే.. దీనికి మరో రూ.15 వేలు అదనంగా చేర్చి మొత్తం ఖరీదు మీద రూ.55 వేలు తగ్గించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో చాలా కంపెనీల్లో అమ్మకాలు కాస్త పెరిగినట్టే కనిపిస్తున్నాయి. అదే జూలై నెలలోకి ప్రవేశిస్తే అదనంగా 28 శాతం పన్నుగా చెల్లించాల్సిందే.
 
మోటారు బైక్‌లకు నో
మోటారు బైక్‌ల మీద ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్లు లేవు. ఎందుకనంటే ఇంతకు ముందే పాత రకం మోడళ్ళను తక్కువ ధరకే డీలర్లు వదిలించుకు న్నారు. ఏప్రిల్‌కు ముందు కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఉండదు. ఆ తరువాత కొనుగోలు చేసిన వాటికే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇచ్చారు. ఎలాగూ ఇది అమలులో ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ధరతోనే విక్రయాలకు సిద్ధమవుతున్నారు. దీంతో బైక్‌ కంటే కార్ల విక్రయానికే కొంత ఊతం వచ్చింది. మధ్యతరగతి కుటుంబాలకు బ్యాంకు లోన్లు ఇప్పించి మరీ కార్లు విక్రయించే పద్ధతిని మరికొన్ని కంపెనీలు చొరవ చూపుతున్నాయి. ఒక్క మన జిల్లాలోనే ఈ మధ్యన నెలకు సరాసరిన 250 కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిలో మారుతీ కంపెనీ మోడళ్ళు 150 వరకు విక్రయిస్తున్నారు. మిగతా కంపెనీలు 100 వరకు విక్రయాలు జరుపుతున్నాయి. జీఎస్టీ ప్రభావంతో ఈ నెలాఖరు నాటికి దీనికి రెట్టింపు అమ్మకాలు జరుగుతాయని డీలర్లు ఆశతో ఉన్నారు.
 
మొబైల్స్‌ విక్రయాలపైన ప్రభావం
మొబైల్స్‌ విక్రయాల మీదా కొంత ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే మొబైల్స్‌ అమ్మకాలపై 14.5 శాతం పన్ను అమలులో ఉంది. జీఎస్టీ ప్రకారం వచ్చే నెలలో ఈ పన్ను కాస్తా 18 శాతానికి చేరబోతుంది. జనవరి నుంచి ఏప్రిల్‌ మాసాల మధ్య సరాసరిన రూ.50 కోట్ల విలువైన మొబైల్‌ అమ్మకాలు జరిగాయి. మే నెలలో ఈ అమ్మకాలు పూర్తిగా తగ్గాయి. ఇప్పుడు జీఎస్టీ వచ్చిపడింది. పాత సరుకును వదిలించుకునేందుకు ఆఫర్లు ఇస్తున్నారు. వివిధ రకాల కంపెనీల మోడళ్లు ఐ ఫోన్లు, శాంసంగ్‌ గెలాక్సీ, నోట్‌ వంటి రకాలకు ఈ మధ్యన గట్టి డిమాండ్‌ వచ్చింది. ఇవికాక అనేక రకాల మోడళ్ళు పాత స్టాక్‌గా మిగిలిపోయాయి. ఇప్పుడు జీఎస్టీ దెబ్బతో మొబైల్స్‌ విక్రయదారులంతా తక్కువ ధరకే వీటిని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు

Comments

Post a Comment

Popular posts from this blog

Why Andhra Pradesh won't benefit from the special status Naidu wants for state

70th Independence Day: 70 facts about INDIA that make the country GREAT

Surrogacy Law in India