ఫ్రీ కాల్స్... ఫ్రీ డేటా... రిలయన్స్ జియో తాజా ఆఫర్ అదుర్స్ !
డేటా ప్యాక్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించి, ఇతర టెలికామ్ కంపెనీలకు షాకిచ్చిన రిలయన్స్ జియో తన సేవలను మరింత విస్తృతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గురువారం ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవలను ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కలలు కన్న డిజిటల్ ఇండియాను రిలయన్స్ జియో నెరవేరుస్తుందని చెప్పారు. జీవితం డిజిటల్ మయమవుతోందని, రానున్న 20 సంవత్సరాల్లో డిజిటల్ ఇండియా అని పిలుచుకోనున్నామని ధీమా వ్యక్తం చేశారు.
డిజిటల్ ర్యాంకింగ్‌లో ఇండియా స్థానాన్ని జియో మెరుగుపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డిజిటల్ ప్రపంచంలో డేటా అనేది ఆక్సిజన్ లాంటిదని ఆయన తెలిపారు. రిలయన్స్ జియోని కేవలం వ్యాపార దృక్పథంతోనే ప్రారంభించలేదని, ప్రతీ భారతీయడికి టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించామని ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. రిలయన్స్ జియో మూడు సూత్రాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. జియో నెట్‌వర్క్ కస్టమర్లు కేవలం ఒక్క సర్వీస్‌కు మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. వాయిస్ లేదా డేటా ఏదైనా ఒక సర్వీస్‌కు చెల్లిస్తే మిగిలినది ఉచితంగా లభిస్తుందని ఆయన చెప్పారు. ఇండియా మొత్తం ఫ్రీ రోమింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. డేటాపై ఒక ఎంబీకి 5 పైసలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. అంటే 50 రూపాయలకే 1జిబి 4జీ డేటాను పొందొచ్చు. పూర్తిగా నెల రోజుల వ్యాలిడిటీతో. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు అందిస్తున్న డేటా సర్వీస్ తమదేనని ముఖేష్ అంబానీ చెప్పారు.
బ్లాక్ అవుట్ డేట్స్ లాంటివి కూడా రిలయన్స్ జియోలో ఉండవని తెలిపారు. ఆధార్ కార్డ్ ఇచ్చిన 10 నిమిషాల్లోనే కనెక్షన్ అందిస్తామని ఆయన తెలిపారు. ఇండియాలోనే అత్యుత్తమ నెట్‌వర్క్‌గా రిలయన్స్ జియో అవతరించబోతుందని, డిజిటల్ ఇండియాగా భారత్‌ను ప్రపంచ పటంలో నిలిపే దిశగా రిలయన్స్ జియో కృషి చేస్తుందని ముఖేష్ అంబానీ తెలిపారు. రిలయన్స్ జియో కొన్ని స్మార్ట్‌ఫోన్లతో సంయుక్తంగా ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ మూడు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి రిలయన్స్ జియో పొందిన కస్టమర్లు 3నెలల వరకూ అపరిమిత డేటా, అపరిమిత కాల్స్‌ను పొందొచ్చు. మూడు నెలల అనంతరం రిలయన్స్ జియో కస్టమర్లకు వర్తించబోయే ఆఫర్లు ఏ విధంగా ఉన్నాయో ఈ కింద ఇవ్వడమైనది.
డేటా ప్యాక్స్:
కాలింగ్ రేట్లు:
ఈ మూడు నెలలు వర్తించబోయే ఆఫర్లు:
Comments
Post a Comment