రెడీ..రెడీ..హోదాపై కేంద్ర నిర్ణయానికి సమయం ఆసన్నమైంది?
హైదరాబాద్: ఢిల్లీలో ఇవాల్టి నుంచి హోదాపై హడావిడి జరగబోతోందా? ఏపీ ఫైల్ కదలబోతోందా? అటు ప్రధాని మోదీ విదేశీ పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇటు చంద్రబాబు కూడా విదేశీ పర్యటను ముగించుకుని తిరిగి వచ్చారు. మోదీ విదేశీ పర్యటనలో ఉండటం, చంద్రబాబు సంప్రదింపులకు అందుబాటులో లేక పోవడంతో హోదాపై మూడు రోజులుగా బ్రేక్ పడింది. మళ్లీ ఈ రోజు మథనం మొదలవుతోంది. ఏపీకి కేంద్రం ఏం ఇవ్వాలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. చంద్రబాబును సంప్రదించి ఆయన్ను ఒప్పించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం వ్యూహంగా కనబడుతోంది. బాబు కూడా ఈ రోజునుంచి అందుబాటులో ఉంటారు కాబట్టి హోదా వ్యవహారం ఇక స్పీడు అందుకోనుంది.
జీఎస్టీ వచ్చాక దేశమంతా ఒకే పన్నుల విధానం వచ్చేస్తుంది. ఏపీకి పారిశ్రామిక రాయితీలు, లోటు భర్తీ ఎలా? ఎంత? నిధుల కేటాయింపు సంగతేంటీ? ఇవే ఇప్పుడు తేలాల్సిన ప్రధాన సంగతులు. ఇక్కడే పీట ముడి పడుతోంది. జీఎస్టీ వచ్చాక దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం రాబోతోంది. ఇక ప్రత్యేక కేటాయింపులు, మినహాయింపులకు ఆస్కారం లేదని కేంద్ర ఆర్తిక శాఖలో బ్యూరోక్రాట్స్ మొరాయిస్తున్నారు. కానీ విభజన జరిగినప్పుడు జీఎస్టీ లాంటివి లేవు కాబట్టి అప్పుడు ఏమి చెప్పారో ఇప్పుడు అవే ఇవ్వాలని ఏపీ పట్టుబడుతోంది. వీటితో పాటుగా ఇంకా తేలాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఏపీకి ప్రత్యేకంగా ప్రారిశ్రామిక రాయితీలు ఇవ్వలేని పక్షంలో ప్రత్యేకంగా ఎడాదికి ఓ రెండు, మూడు వందల కోట్లు కేటాయించి ఓ నిధిని ఏర్పాటు చేసే పనిలో కేంద్రం ఉందని అంటున్నారు. అయితే ఈ నిధికి కేటాయింపులు ఎలా అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను భర్తీ చేసేందుకు ఎడాదికి 2800ల కోట్ల చోప్పున ఇవ్వాని కేంద్రం అనుకుంటోందని, ఇదంతా కేవలం సన్నాహాకాలేనని, అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సంగతి మాట్లాడుదామంటే హోదా తప్ప మరేది వద్దని చంద్రబాబు తేల్చిచెప్పారని అయితే ఈ కోణంలో అడుగు పడాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Comments
Post a Comment