గుంటూరు- విజయవాడ రైలుమార్గంలో మెగా లైన్ బ్లాక్‌



విజయవాడ స్టేషను లో సాంకేతిక పనులు
పలు రైళ్ల పాక్షిక రద్దు, మళ్లింపు
ఆంధ్రజ్యోతి- గుంటూరు: విజయవాడ రైల్వే స్టేషను లో సాంకేతిక పనులు జరుగుతున్న కారణంగా ఈ నెలలో మెగా లైన్ బ్లాక్‌ను తీసుకొంటున్నట్లు రైల్వే గుంటూరు సీనియర్‌ డీసీఎం కె. ఉమామహేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని వల్ల పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తామని, కొన్నింటిని దారి మళ్లించి నడుపుతామని వెల్లడించారు. ప్రయాణికులు మార్పులను గమనించి ప్రయాణ ప్రణాళికను రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 పూర్తిగా రద్దయ్యే రైళ్లు 
నెంబర్‌ 17239/17240 గుంటూరు- విశాఖపట్టణం- గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 22, 23, 24 తేదీల్లో రద్దు చేశారు. 
నెంబర్‌ 17201/17202 గుంటూరు- సికింద్రాబాద్‌- గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 23న రద్దు. 
నెంబర్‌ 17211 మచిలీపట్నం- యశ్వంతపూర్‌ కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ 23న, 17212 యశ్వంతపూర్‌- మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ 24న రద్దు. 
నెంబర్‌ 17644 కాకినాడ పోర్టు- చెన్నై ఎగ్మోర్‌- కాకినాడ సర్కారు ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 23న రద్దు. 
 పాక్షికంగా రద్దయ్యే రైళ్లు 
నెంబర్‌ 12077/12088 చెన్నై సెంట్రల్‌- విజయవాడ- చెన్నై సెంట్రల్‌ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు గుంటూరులోనే నిలిపేసి ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేస్తారు. 
నెంబర్‌ 17226 హుబ్లీ- విజయవాడ అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 21, 22, 23 తేదీల్లో, నెంబర్‌ 17225 విజయవాడ- హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు 22, 23 తేదీల్లో గుంటూరులో నిలిపేసి తిరుగు ప్రయాణానికి పంపిస్తారు. 
నెంబర్‌ 12796/12795 సికింద్రాబాద్‌- విజయవాడ- సికింద్రాబాద్‌ ఉద్యోగుల రైలు ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో గుంటూరులో నిలిపేసి తిరుగు ప్రయాణానికి నడుపుతారు. 
నెంబర్‌ 17216 ధర్మవరం- విజయవాడ రైలును ఈ నెల 20, 22 తేదీల్లో, నెంబర్‌ 17215 విజయవాడ- ధర్మవరం రైలును 21, 24 తేదీల్లో గుంటూరు నుంచి నడుపుతారు. 
 గుంటూరు డివిజన రైళ్ల మళ్లింపులు 
నెంబర్‌ 16032 జమ్ముతావి- చెన్నై సెంట్రల్‌ రైలుని ఈ నెల 20న కాచిగూడ మార్గంలో నడుపుతారు. దీని వల్ల న్యూగుంటూరు రైల్వేస్టేషనలో ఈ నెల 23న సర్వీసు అందుబాటులో ఉండదు. 
నెంబర్‌ 12706/12705 సికింద్రాబాద్‌- గుంటూరు- సికింద్రాబాద్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు వరంగల్‌ మార్గంలో కాకుండా నడికుడి మార్గంలో నడుపుతారు. 
నెంబర్‌ 17221 కాకినాడ పోర్టు- లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ రైలు ఈ నెల 21, 24వ తేదీన రాజమహేంద్రవరం నుంచి గుణదల, వరంగల్‌, కాజీపేట మార్గంలోకి మళ్లిస్తారు. దీని వల్ల గుంటూరు స్టేషనలో ఈ నెల 21, 24 తేదీల్లో సర్వీసు అందుబాటులో ఉండదు. 
నెంబర్‌ 12805/12806 విశాఖపట్టణం- సికింద్రాబాద్‌- విశాఖపట్టణం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 22, 23 తేదీల్లో గుణదల నుంచి కాజీపేట మార్గంలోకి మళ్లిస్తారు. 
నెంబర్‌ 18464 బెంగళూరు సిటీ జంక్షన- భువనేశ్వర్‌ రైలును డోన నుంచి కాచిగూడ, కాజీపేట, గుణదల, రాజమహేంద్రవరం మార్గంలో నడుపుతారు. దీని వల్ల ఈ నెల 23వ తేదీన గుంటూరులో సర్వీసు ఉండదు. 
నెంబర్‌ 17222 లోకమాన్యతిలక్‌ టెర్మినల్‌- కాకినాడ పోర్టు రైలు ఈ నెల 22, 25 తేదీల్లో కాజీపేట మార్గంలో మళ్లిస్తారు. 
నెంబర్‌ 17231 నరసాపూర్‌- నాగర్‌సోల్‌ రైలును ఈ నెల 23న కాజీపేట మార్గంలో మళ్లిస్తారు. 
నెంబర్‌ 18463 భువనేశ్వర్‌- బెంగళూరు సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 23న కాజీపేట మార్గంలో మళ్లిస్తారు. 
నెంబర్‌ 17204 కాకినాడ టౌన- భావనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 22న రాజమహేంద్రవరం- గుణదల మార్గంలో కాజీపేట మీదగా మళ్లిస్తారు. 
 ఇతర డివిజన రైళ్ల మళ్లింపులు గుంటూరు మీదుగా నెంబర్‌ 17406 ఆదిలాబాద్‌- తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు, నెంబర్‌ 17405 తిరుపతి- ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు నడికుడి మార్గంలో గుంటూరు మీదుగా నడుపుతారు. 
నెంబర్‌ 12710 సికింద్రాబాద్‌- గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 21, 22 తేదీల్లో నడికుడి మార్గంలో గుంటూరు మీదుగా నడుపుతారు. 
నెంబర్‌ 12764 సికింద్రాబాద్‌- తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 22, 23, 25 తేదీల్లో, నెంబర్‌ 12763 తిరుపతి- సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ని 23, 24, 26 తేదీల్లో తెనాలి, గుంటూరు, నడికుడి మీదగా సికింద్రాబాద్‌కు నడుపుతారు. 
 నాలుగు రైళ్ల రీ షెడ్యూల్‌ 
నెంబర్‌ 22831 హౌరా జంక్షన- శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 21న మధ్యాహ్నం 3.35 గంటలకు బదులు రాత్రి 7.30 గంటలకు, నెంబర్‌ 16031 చెన్నై సెంట్రల్‌- జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 22న వేకువజామున 5.15 గంటలకు బదులు ఉదయం 8.30 గంటలకు, నెంబర్‌ 18047 హౌరా జంక్షన- వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 22వ తేదీన రాత్రి 11.30 గంటలకు బదులు 23న ఉదయం 5 గంటలకు, నెంబర్‌ 22832 శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం- హౌరా జంక్షన ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 23న ఉదయం 7.40 గంటలకు బదులు ఉదయం 11 గంటలకు బయలుదేరతాయి. 
 ప్యాసింజర్‌ రైళ్ల రద్దు 
నెంబర్‌ 77221 విజయవాడ- గుంటూరు ప్యాసింజర్‌ రైలు ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు, నెంబర్‌ 57318 మాచర్ల- భీమవరం జంక్షన ప్యాసింజర్‌ రైలు 21 నుంచి 28 వరకు, నెంబర్‌ 57382 నరసాపూర్‌- గుంటూరు ప్యాసింజర్‌ రైలు 21 నుంచి 28 వరకు, నెంబర్‌ 77283 గుంటూరు- విజయవాడ ప్యాసింజర్‌ రైలు 21 నుంచి 24 వరకు, 26 నుంచి 28 వరకు, నెంబర్‌ 67273 విజయవాడ- గుంటూరు ప్యాసింజర్‌ 21 నుంచి 28 వరకు, నెంబర్‌ 67274 గుంటూరు- విజయవాడ ప్యాసింజర్‌ రైలు 21 నుంచి 28 వరకు, నెంబర్‌ 77284 విజయవాడ - గుంటూరు ప్యాసింజర్‌ ఈ నెల 21 నుంచి 24 వరకు, 26 నుంచి 28 వరకు, నెంబర్‌ 57381 గుంటూరు- నరసాపూర్‌ ప్యాసింజర్‌ రైలు 20 నుంచి 27 వరకు, నెంబర్‌ 57316 నరసాపూర్‌- గుంటూరు ప్యాసింజర్‌ రైలు 21 నుంచి 28 వరకు, నెంబర్‌ 77230 గుంటూరు- విజయవాడ ప్యాసింజర్‌ 21 నుంచి 28 వరకు, నెంబర్‌ 77289 గుంటూరు- విజయవాడ ప్యాసింజర్‌ 21 నుంచి 24 వరకు, 26 నుంచి 28 వరకు రద్దు చేశారు. 
 ప్యాసింజర్‌ రైళ్ల పాక్షిక రద్దు 
నెంబర్‌ 56503 బెంగళూరు కంటోన్మెంట్‌- విజయవాడ ప్యాసింజర్‌ రైలును ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు గుంటూరు వరకే నడుపుతారు. నెంబర్‌ 56501 విజయవాడ- హుబ్లీ ప్యాసింజర్‌ రైలు 21 నుంచి 28 వరకు గుంటూరు నుంచి ఉదయం 8.20 గంటలకు బయలుదేరి వెళుతుంది. నెంబర్‌ 56502 హుబ్లీ- విజయవాడ రైలు 21 నుంచి 28 వరకు గుంటూరు నుంచి నడుపుతారు. నెంబర్‌ 56504 విజయవాడ- బెంగళూరు కంటోన్మెంట్‌ రైలును 21 నుంచి 28 వరకు గుంటూరు నుంచి నడుపుతారు.

Comments

Popular posts from this blog

Why Andhra Pradesh won't benefit from the special status Naidu wants for state

70th Independence Day: 70 facts about INDIA that make the country GREAT

Surrogacy Law in India