సుకన్య సమృద్ధి యోజనలో మార్పులు





మారిన నియమాలతో ఊరట 
  • ఉన్నత విద్య కోసం డబ్బు తీసేసుకోవచ్చు 
విజయవాడ  : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాల్లో సుకన్య సమృద్ధి పథకం ఒకటి. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా ప్రచారం కల్పించా యి. మైనర్‌ బాలికల పేరుతో ఈ ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. బాలికల పేరుతో పొదుపు , దాన్ని వారి ఉన్నతవిద్య, వివాహాల కోసం ఉపయోగించడం వంటి ప్రధాన అంశాల ఆధారంగా ఈ పథకానికి రూపలక్పన చేశారు. 2015లో ప్రారంభమైన పథకానికి ఇటీవల కొన్ని మార్పులు చేశారు. అవేంటో మీ కోసం.. 
సుకన్య సమృద్ధి యోజన కింద దాదాపు 85 లక్షల ఖాతాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దాదాపు 2,900 కోట్లు బ్యాంకుల్లో, పోస్టాఫీస్‌ల్లో జమయ్యాయి. ఈ నేపథ్యంలో చేసిన మార్పులు ఒకసారి చూస్తే .. 
  • ఈ పథకం కేవలం భారతీయులకు మా త్రమే వర్తిస్తుంది. ఒక వేళ ఖాతాదారులు భారత పౌరసత్వం కోల్పోతే ఖాతా మూసివేస్తారు. దీనికి ఎలాంటి వడ్డీ జమ కాదు. 
  •  ఖాతాను ఒక చోటు నుచి మరో చోటుకు బదిలీ చేసుకోవచ్చు. ఇల్లు మారుతున్నట్లు ఆధారాలు చూపితే ఈ సౌలభ్యం ఉంటుంది. ఇష్ట ప్రకారం మార్చుకోవాలంటే రూ. 100 చెల్లిస్తే ఖాతాను మారుస్తారు. 
  •  ఒక ఆర్థిక సంవత్సరంలో జమ చేసే సొమ్ము రూ. 1.5 లక్షలకు మించకూడదు. అలా మించిన సొమ్ముకు వడ్డీ రాదు. పరిమితికి మించి డిపాజిట్‌ చేసిన సొమ్మును ఎప్పుడైనా వెనక్కు తీసుకోవచ్చు. 
  • ఏడాదికి ఒకసారి చక్రవడ్డీ రూపంలో లెక్కిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేట్లు మాత్రమే అమలవుతాయి. ఏప్రిల్‌ 1న ప్రకటించిన దాని ప్రకారం ప్రస్తుతం 8.5 శాతం వడ్డీ అందుతుంది. 
  •  ఇంతకు ముందు అమ్మాయి గరిష్ట వయస్సు 14 ఏళ్ల వరకు డిపాజిట్‌ అవకాశం ఉండేది. ఇప్పు డు దాన్ని 15 ఏళ్లకు మార్చారు. 
  •  ఇంతకు ముందు కనీస వడ్డీ రావాలంటే ఏ డాదికి రూ.వెయ్యి జమ చేయాలన్న నిబంధన ఉండేది. డిపాజిట్‌ చేయకున్నా నాలుగు శాతం వడ్డీ ఇచ్చేలా మార్పు చేశారు. 
  •  గతంలో డిపాజిట్లు నగదు రూపంలో డీడీ రూపంలో చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ పే మెంట్‌ విధానంలోనూ జమ చేయవచ్చు. 
  • గతంలో అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు ఖాతాలో డబ్బు అలానే ఉంటుంది. మెచ్యూరిటీ తీరే వరకు డబ్బు తీసే అవకాశం ఉండదు. ఇప్పుడు బా లిక ఇంటర్‌లో చేరే సమయం నుంచి ఉన్నత విద్య కోసం డబ్బు తీసుకునే వెసులుబాటు కల్పించారు. 

Comments

Popular posts from this blog

Samsung Galaxy Note 8 256GB