గ్రామీణ బ్యాంకుల్లో భారీగా కొలువులు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబిపిఎస్‌) - దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో గ్రూప్‌ అ ఆఫీసర్స్‌(స్కేల్‌ 1, 2, 3), గ్రూప్‌ ఆ ఆఫీస్‌ అసిస్టెంట్స్‌(మల్టీపర్పస్‌) పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. మొత్తమ్మీద 16,560 పోస్టులు ఉన్నాయి.
ఆఫీస్‌ అసిస్టెంట్స్‌(మల్టీ పర్పస్‌)
ఖాళీలు: 8824(తెలుగు రాష్ట్రాల్లో 787 ఖాళీలు ఉన్నాయి)
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
వయసు: 28 ఏళ్లకు మించరాదు
ఆఫీసర్‌ స్కేల్‌ - 1
ఖాళీలు: 5,539 (తెలుగు రాష్ట్రాల్లో 552 ఖాళీలు ఉన్నాయి)
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ, యానిమల్‌ హజ్‌బెండ్రీ, వెటర్నరీ సైన్స్‌, అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ అండ్‌ కో ఆపరేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌, లా, ఎకనామిక్స్‌, అకౌంటెన్సీల్లో డిగ్రీ చదివినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 30 ఏళ్లకు మించరాదు
ఆఫీసర్‌ స్కేల్‌ - 2(జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌)
ఖాళీలు: 1533(తెలుగు రాష్ట్రాల్లో 133 ఖాళీలు ఉన్నాయి)
అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ తోపాటు పైన తెలిపిన విభాగాల్లో డిగ్రీ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా బ్యాంక్‌/ ఆర్థిక సంస్థలో ఆఫీసర్‌గా రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించరాదు
ఆఫీసర్‌ స్కేల్‌ - 2(స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌)
ఖాళీలు: 466
స్పెషలిస్ట్‌ విభాగాల వారీ ఖాళీలు: అగ్రికల్చర్‌ ఆఫీసర్‌(152), మార్కెటింగ్‌ ఆఫీసర్‌(75), ట్రెజరీ మేనేజర్‌(19), లా ఆఫీసర్‌(55), చార్టర్డ్‌ అకౌంటెంట్‌(35), ఐటి ఆఫీసర్‌(130)
తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన ఖాళీలు: అగ్రికల్చర్‌ ఆఫీసర్‌(16), మార్కెటింగ్‌ ఆఫీసర్‌(30), లా ఆఫీసర్‌(4), చార్టర్డ్‌ అకౌంటెంట్‌(2), ఐటి ఆఫీసర్‌(11)
అర్హత: బిఇ/ బిటెక్‌/ సీఏ/ ఎంబిఏ/ బిఎల్‌/ బిఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది నుంచి రెండేళ్ల అనుభవం ఉండాలి
వయసు: 32 ఏళ్లకు మించరాదు
ఆఫీసర్‌ స్కేల్‌ - 3
ఖాళీలు: 198 (తెలుగు రాష్ట్రాల్లో 35 ఖాళీలు ఉన్నాయి)
అర్హత: పైన తెలిపిన విభాగాల్లో డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా బ్యాంక్‌/ ఆర్థిక సంస్థలో కనీసం అయిదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లకు మించరాదు
ఎంపిక: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష ఫీజు: రూ.600 (ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది)
పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాలకు సంబంఽధించి హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 14 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 30
ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ పరీక్ష: ఆఫీసర్స్‌ స్కేల్‌ 1కు నవంబరు 5, 6; ఆఫీస్‌ అసిస్టెంట్స్‌కు నవంబరు 12, 13, 19
మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్ష: ఆఫీసర్స్‌ స్కేల్‌ 1, 2, 3లకు డిసెంబరు 11న; ఆఫీస్‌ అసిస్టెంట్స్‌కు డిసెంబరు 18న
పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు
వెబ్‌సైట్‌: www.ibps.in

Comments

Popular posts from this blog

Why Andhra Pradesh won't benefit from the special status Naidu wants for state

70th Independence Day: 70 facts about INDIA that make the country GREAT

Surrogacy Law in India