ప్టెన్‌గా ధోనీ రికార్డ్‌ను సమం చేసిన కోహ్లీ.



కాన్పూర్: టీమిండియా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో చరిత్ర లిఖించింది. ప్రాముఖ్యమైన 500వ టెస్ట్ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. అయితే ఈ క్రమంలో కెప్టెన్‌గా కోహ్లీ భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్‌ను సాధించాడు. టీం ఇండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా కోహ్లీకి ఈ 500వ టెస్ట్ మ్యాచ్ విజయం వరుసగా 11వది. ఈ లెక్కతో కూల్ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డ్‌ను సమం చేశాడు కోహ్లీ. ధోనీ కూడా టెస్టుల్లో వరుసగా 11 విజయాలను సాధించాడు. అయితే ఈ రికార్డ్‌లో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ 18 వరుస విజయాలతో మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత కపిల్ దేవ్ 17, అజారుద్దీన్ 14 వరుస విజయాలను నమోదు చేసి 2,3 స్థానాల్లో ఉన్నారు.

Comments

Popular posts from this blog

What jobs can you do from home and earn a satisfying salary?

Why Andhra Pradesh won't benefit from the special status Naidu wants for state