ఫుట్‌వేర్‌ రంగంలో అవకాశాలు అపారం

ఉపాధి అవకాశాలు ఎక్కువ జనరేట్‌ అయ్యే రంగాన్ని ఎంచుకుంటే కెరీర్‌కు ఢోకా ఉండదు. అలాంటిదే ఫుట్‌వేర్‌ ఇండసీ్ట్ర. ఈ రంగంలో కెరీర్‌ను ఎంచుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. క్రియేటివిటీ ఉంటే ఈ రంగంలో జీతభత్యాలు కూడా ఎక్కువే లభిస్తాయి. ఆ విశేషాలు ఇవి...

చెప్పులు కొనాలంటే నాలుగు షాపులు తిరుగుతాం. నలభై రకాల చెప్పుల మోడల్స్‌ చూస్తాం. ఒక్కటి ఎంపిక చేసుకుంటాం. నాలుగు నెలలు పోగానే మళ్లీ కొత్త మోడల్‌ చెప్పుల కోసం చూస్తుంటాం. అందుకే ఫుట్‌వేర్‌ కంపెనీలు క్రియేటివ్‌ అభ్యర్థులతో ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌ చేయిస్తుంటాయి. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లు రూపకల్పన చేయడం కోసం ఫుట్‌వేర్‌ డిజైనర్లను నియమించుకుంటుంటాయి. కాస్త క్రియేటివిటీ, ఇంకొంచెం డ్రాయింగ్‌ స్కిల్స్‌ ఉన్న వారు ఈ రంగంలో కెరీర్‌ను ఎంచుకోవచ్చు. ఫుట్‌వేర్‌ డిజైనర్‌గానే కాకుండా ప్రోడక్ట్‌ డెవలపర్‌గా, క్వాలిటీ కంట్రోలర్‌గా...ఇలా వివిధ విభాగాల్లో స్థిరపడవచ్చు.
 
ప్రస్తుతం ఫుట్‌వేర్‌ మోడ్రన్‌ యాక్సెసరీగా మారింది. కంఫర్ట్‌తో పాటు ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. ఫుట్‌వేర్‌ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో భారత రెండో స్థానంలో ఉంది. కొత్త కొత్త డిజైన్లు తయారుచేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి కంపెనీలు అభ్యర్థులకు లక్షల జీతాలు వెచ్చించి తీసుకుంటున్నాయి. ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌, ఫుట్‌వేర్‌ టెక్నాలజీని కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మంచి డ్రాయింగ్‌ స్కిల్స్‌ ఉన్న వారు, అప్‌కమింగ్‌ ట్రెండ్స్‌ను అడాప్ట్‌ చేసుకునే నైపుణ్యం ఉన్న వారు ఈ కెరీర్‌ను ఎంచుకుంటే సంతృప్తితో పాటు ఆదాయం బాగుంటుంది.
 
వర్క్‌ ఎలా ఉంటుంది?
ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారు స్కెచ్‌ ప్యాటర్స్‌, స్కేల్‌ డ్రాయింగ్స్‌ రూపంలో డిజైన్స్‌ వేయాల్సి ఉంటుంది. చేత్తో పేపర్‌ స్కెచ్‌ వేయవచ్చు లేక కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో వేయవచ్చు. మీరు గీసిన క్రియేటివ్‌ శాంపిల్‌ కంపెనీకి నచ్చితే కనుక అసలైన పని మొదలవుతుంది. కాన్సెప్ట్‌ డిజైన్‌ను రియల్‌ ఫుట్‌వేర్‌లోకి కన్వర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఫుట్‌వేర్‌ సులువుగా ధరించగలగాలి. పాదాలకు ఎటువంటి హాని జరగకూడదు. డిజైనర్స్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ ఎక్కువగా ప్రొడక్షన్‌ స్టేజ్‌లోనే ఉంటుంది. ఒక్కసారి డిజైన్‌ను ఓకే చేశాక మళ్లీ మార్పులకు అవకాశం ఉండదు. సేఫ్టీ, కంఫర్ట్‌, క్వాలిటీ...ఇలా అన్ని విషయాల్లోనూ పక్కాగా ఉండేలా చూసుకోవడం డిజైనర్‌ చేతుల్లోనే ఉంటుంది. డిజైనర్‌ ఫుట్‌వేర్‌ రంగు, డిజైన్‌పైనే దృష్టి పెడితే సరిపోదు. సైజు, కంఫర్ట్‌, పనితీరు, సైజుకు తగిన విధంగా ఫిట్‌ కావడం వంటి అంశాలను కూడా డిజైనర్‌ చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే క్రియేటివ్‌ డిజైనర్స్‌కు కంపెనీలు లక్షల జీతాలు చెల్లించడానికి ముందుకొస్తుంటాయి.

ప్రవేశం ఎలా?
ఫుట్‌వేర్‌ డిజైన్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీలో అండర్‌గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన వారు డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశం కావాలనుకుంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లెదర్‌ డిజైనింగ్‌/టెక్నాలజీ ఇన్‌ బిఎ్‌ససీ/బీటెక్‌లో ప్రవేశం కావాలంటే 10+2 ఫిజిక్స్‌, కెమిసీ్ట్ర, మ్యాథ్స్‌తో పూర్తి చేసి ఉండాలి. ఐఐటిలో ప్రవేశం కావాలంటే ఐఐటీజెఈఈ, ఎన్‌ఐటిలో చేరాలంటే ఏఐఈఈఈలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎమ్‌టెక్‌ లెదర్‌ టెక్నాలజీ చదవాలంటే బిటెక్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
 
ఉద్యోగావకాశాలు
ఫుట్‌వేర్‌ ఇండసీ్ట్రలో ఉద్యోగవకాశాలు పుష్కలంగా ఉంటాయి. టెక్నికల్‌, డిజైనింగ్‌, మేనేజ్‌మెంట్‌ ఏరియాల్లో ఉద్యోగాలు ఎక్కువగా జనరేట్‌ అవుతుంటాయి. ఈ రంగంలో కెరీర్‌ను ఎంచుకుంటే ఫుట్‌వేర్‌ డిజైనర్‌, ప్రోడక్ట్‌ డెవలపర్‌, ప్రోడక్ట్‌ డెవల్‌పమెంట్‌ మేనేజర్‌, క్వాలిటీ కంట్రోలర్‌, ఫుట్‌వేర్‌ టెక్నాలజిస్ట్‌, మెర్చండైజర్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్లానింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, ట్రెండ్‌ ఎనలిస్ట్‌ వంటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు. రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌, డిజైన్‌, మాన్యుఫాక్చరింగ్‌ ఆపరేషన్స్‌ వంటి ఉద్యోగాలు ఉంటాయి. అనుభవం ఉన్న టెక్నీషియన్స్‌ అవసరం కంపెనీల్లో ఎప్పుడూ ఉంటుంది. టాప్‌ ఇనిస్టిట్యూట్‌లో చదివిన అభ్యర్థులను ఇంటర్నేషనల్‌ కంపెనీలు త్వరగా ఉద్యోగం ఆఫర్‌ చేస్తుంటాయు. కంపెనీల్లో జాబ్‌ చేయడం ఇష్టం లేని వారు సొంతంగా డిజైన్‌ స్టూడియో నెలకొల్పుకోవచ్చు. సంతృప్తితోపాటు ఆదాయం అధికంగా ఉండే కెరీర్‌ ఇది. అనుభవం ఉన్న డిజైనర్లకు ఏడాది ప్యాకేజీలు బాగుంటాయి.
 
కొన్ని ప్రధాన ఇనిస్టిట్యూట్‌లు
  • ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఇనిస్టిట్యూట్‌(ఎ్‌ఫడిడిఐ), నొయిడా, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబై.
  • సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఎల్‌ఆర్‌ఐ), చెన్నై.
  • చెన్నై సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రెయినింగ్‌ ఇనిస్టిట్యూట్‌, చెన్నై.
  • నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌), న్యూఢిల్లీ, గాంధీనగర్‌, చెన్నై.
  • గవర్నమెంట్‌ లెదర్‌ ఇనిస్టిట్యూట్‌, ఆగ్రా.

Comments

Popular posts from this blog

Why Andhra Pradesh won't benefit from the special status Naidu wants for state

70th Independence Day: 70 facts about INDIA that make the country GREAT

Surrogacy Law in India