ఎయిడ్స్ వ్యాధిని జయించిన మానవుడు !
బెర్లిన్: తాను తలచుకుంటే ఏదైనా సాధించగల మానవుడు ఎయిడ్స్ వ్యాధికి మందు కనుగొనడంలో మాత్రం దశాబ్దాలుగా ఓటమిని చవిచూస్తున్నాడు. కానీ మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడని మరోసారి నిరూపితమైంది. ఓ వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి నయమయిందట. దీంతో ప్రతీఒక్కరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తిమోతి రే బ్రౌన్ ఈ పేరు ప్రపంచమంతా మారుమోగిపోతోంది. ఎందుకంటే ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిని జయించిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. అమెరికాకు చెందిన తిమోతికి 1995లో హెచ్‌ఐవీ సోకింది. క్రమంగా ఎయిడ్స్ వ్యాధిగా మారింది. చికిత్స కోసం తిమోతీ జర్మనీలోని బెర్లిన్ వెళ్లాడు. చికిత్స మొదలు పెట్టిన వైద్య బృందం తిమోతీపై జరిపిన పరిశోధనలకు అనూహ్యమైన ఫలితం వచ్చింది. ప్రపంచానికి సవాల్ విసిరిన ఎయిడ్స్ వ్యాధి తగ్గిపోయినట్లు తెలిసింది.
ఎయిడ్స్ వ్యాధి ఎలా తగ్గిందంటే...
ఎయిడ్స్ వ్యాధిని తగ్గించేందుకు వైద్యులు 2007 నుంచి ‘స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ , ఇతర చికిత్సలు పెనుమోనియా, సెప్సిస్‌లను తిమోతికి చికిత్సగా అందించారు. ఈ చికిత్సతో తిమోతీలో సీడీ4 కౌంట్ బాగా పెరగడంతో రోగనిరోధక శక్తి బాగా పెరిగింది. ఈ చికిత్సను నిరంతరంగా అందించడంతో తిమోతి రక్తంలో హెచ్‌ఐవి వైరస్ తొలగిపోయింది. దీంతో వైద్య బృందం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ విధానం ద్వారానే తిమోతీ ఎయిడ్స్ వ్యాధిని నయం చేయగలిగామని వైద్యుల బృందం తెలిపింది.
Comments
Post a Comment