నిరుద్యోగులారా... మీకే చెప్పేది... తెలుసుకుంటే మీకే మంచిది !
- ద్యోగాలు ఇస్తామంటూ ఆశలు
- మోసాలకు పాల్పడుతున్న ముఠాలు
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఆశలు రేపి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వారి ఆస రాను అలుసుగా తీసుకొని నిలువునా ముంచు తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ... గోడ పత్రికలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. దీంతో అమాయిక నిరుద్యోగులు ఆశతో మోసపోతున్నారు.
అర చేతిలో స్వర్గం..
ముఖ్య కూడళ్లలో చూసినా... ఆర్టీసీ కాంప్లెక్సులో చూసినా... బస్సుల్లో చూసినా... బజారులో ఎక్కడ చూసినా ఇటీవల కాలంలో ఉద్యోగ ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. కనీస విద్యార్హతతో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు నెలకు వేతనం, ఉచిత వసతి, భోజన సదుపాయంతోపాటు శిక్షణ అనంతరం రెట్టిం పు వేతనాలు అందిస్తామంటూ ప్రకట నలు ఉదరగొడుతున్నారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు దరఖాస్తు చేస్తున్నారు.
ఈ ప్రకటనలు నమ్మి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్న నిరుద్యోగులకు చేతి చమురు వదులుతోంది. ఉద్యో గాలకు సంబంధించి తమ పేర్లు నమోదు కోసం రూ. 500 నుంచి రూ.1,000 వరకు చెల్లించాలంటూ సంబంధిత నిర్వాహకులు సమాధానం పంపుతున్నారు. చిన్న మొత్తం కావడంతో కొంత మంది నిరుద్యోగులు సొమ్ము చెల్లిస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో వారి ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో మోసపోయామంటూ ఆలస్యంగా నిరుద్యోగులు గుర్తిస్తున్నారు. ఉద్యోగ ప్రకటనల్లో కేవలం సెల్ నెంబర్ తప్ప ఇతర వివరాలు ఉండడం లేదు. ఈ మూడు నెలల వ్యవధిలో ఎంతోమంది నిరుద్యోగులు ఇలా సొమ్ము చెల్లించి మోసపోయిన వారు జిల్లాలో ఎంతో మంది ఉన్నట్లు తెలుస్తుంది. సెక్యూరిటీ గార్డు లు, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలంటూ ప్రకటనలు ఇస్తుండటంతో సులభంగా నిరుద్యోగులు ఆకర్షణకు గురవుతున్నారు.
ఫిర్యాదుకు వెనుకంజ
నిరుద్యోగులు పెద్దసంఖ్యలో మోసపోతున్నప్పటికీ పోలీసుస్టేషన్లల్లో ఫిర్యాదులు ఇచ్చేం దుకు ముందుకు రావడం లేదు. స్వల్ప మొత్తమే కావడం, మోసపోయామన్నా విషయం పదిమందికి తెలిసిపోతుందన్న నెపంతో ఫిర్యాదులకు వెనుకంజ వేస్తున్నారు. అధికారులు సైతం ఇటువంటి ప్రకటనలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. కనీసం ప్రకటనల్లో చిరునామాలు సైతం ఇవ్వకపోవడం, కేవలం ఫోన్ నెంబరు మాత్రం ఇస్తుండటంతో మోసగిస్తున్న వారు సులభంగా తప్పించుకుంటున్నారు.
Comments
Post a Comment