ఎన్‌సిఇఆర్‌టిలో ఉద్యోగాలు
నేషనల్ కౌన్సెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ హెడ్ మాస్టర్లు ఖాళీలు: 2
అర్హత: 45 శాతం మార్కులతో పీజీ, బిఇడి ఉత్తీర్ణులై ఉండాలి. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వైస్ ప్రిన్సిపాల్/ పిజిటి/ లెక్చరర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి
వయసు: 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎన్‌సిఇఆర్‌టి ఉద్యోగులకు ఎటువంటి వయో నిబంధన వర్తించదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
పిజిటి(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు)
విభాగాలు- ఖాళీలు: ఇంగ్లీష్ 2, హిస్టరీ 1, మేథ్స్ 2, కెమిస్ట్రీ 1, బయాలజీ 1, హిందీ 1, కామర్స్ 1, కంప్యూటర్ సైన్స్ 3, గైడెన్స్ కౌన్సెలర్ 2
అర్హత: ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెస్సీగానీ 50 శాతం మార్కులతో పీజీ గానీ ఉండాలి. దానితోపాటు బిఇడి/ఎంఇడి పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ టీచర్ పోస్టుకు (బిఇ/ బిటెక్) (కంప్యూటర్ సైన్స్/ ఐటి)ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు కంప్యూటర్ సైన్స్‌లో పీజీ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. బిసిఏ/ ఎంసిఏ అభ్యర్థులు, బిఎస్సీ/ ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌లో పీజీ డిప్లొమాతోపాటు ఏ సబ్జెక్టులోనైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసినవారు కూడా అర్హులే. గైడెన్స్ కౌన్సెలర్ పోస్టుకైతే (ఎమ్మే/ ఎమ్మెస్సీ)(సైకాలజీ) తోపాటు గైడెన్స్ & కౌన్సెలింగ్‌లో ఏడాది పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. లేదంటే పీజీ తోపాటు బిఇడి/ ఎంఇడి పూర్తిచేసి పీజీ డిప్లొమా (గైడెన్స్ & కౌన్సెలింగ్) పాసై ఉండాలి. లేదా రిహాబిలిటేషన్ కౌన్సెల్ ‘ఒకేషనల్ కౌన్సెలర్’గా గుర్తింపు పొంది ఉండాలి. పై అర్హతలతో పాటు పిజిటిలకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో టీచింగ్ నైపుణ్యం ్క్ష కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ప్రావీణ్యం ఉండాలి.
వయసు: ఎన్‌సిఇఆర్‌టి ఉద్యోగులు తప్ప మిగిలిన వారందరికీ 40 ఏళ్లు మించరాదు
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
టిజిటి(ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు)
విభాగాలు- ఖాళీలు: కామర్స్ 1, అగ్రికల్చర్ 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, మ్యూజిక్ 1, ఇంగ్లీష్ 3, హిందీ 2, డ్యాన్స్ 1
అర్హత: 50 శాతం మార్కులతో ఎన్‌సిఇఆర్‌టి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. లేదా డిగ్రీ + సీటెట్ పాసై ఉండాలి. విభాగాన్ని అనుసరించి టిజిటిలకు ఉండాల్సిన అర్హత వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
వయసు: 35 ఏళ్లకు మించరాదు
పిఆర్‌టి (ప్రైమరీ టీచర్లు) ఖాళీలు: 13
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ పూర్తిచేసి సీటెట్ పాసై ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా బోధించే నైపుణ్యంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించరాదు
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
వర్క్ ఎక్స్‌పీరియెన్స్ టీచర్లు ఖాళీలు: 29
విభాగాలు: రేడియో అండ్ ఎలకా్ట్రనిక్స్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, వుడ్ వర్క్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, స్టెనోగ్రఫీ, డ్యాన్స్, యోగా, హోమ్ సైన్స్, ఎలక్ట్రికల్
అర్హత: పదోతరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులం దరూ అర్హులే. అయితే విభాగాన్ని అనుసరించి ఉండాల్సిన అదనపు అర్హత సమాచారం కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
వయసు: 35 ఏళ్లకు మించరాదు
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష కేంద్రం: పై పోస్టుల భర్తీకోసం నిర్వహించే రాతపరీక్షను ఢిల్లీ నగరంలో మాత్రమే నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ మహిళలు/ ఎన్‌సిఇఆర్‌టి ఉద్యోగులకు ఎటువంటి ఫీజు అవసరం లేదు)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 26
వెబ్‌సైట్: www.ncert.nic.in
Comments
Post a Comment